News November 6, 2025
చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆలోచనను CBN మార్చుకునేలా ఉద్యమాలు చేపట్టాలని YS జగన్ YCP విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై ‘రచ్చబండ’ ద్వారా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ‘ఈ ఉద్యమాలు ఎలా ఉండాలంటే CBNకు షాక్ తగిలేలా ఉండాలి. ఫీజు రీయింబర్స్‌మెంటుపై కూడా డిసెంబర్ వరకు టైమ్ ఇస్తాం. ఆ తరువాత ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థి విభాగం ఉండాలన్నారు.
Similar News
News March 16, 2026
HYD: ఎమ్మెల్యే సాబ్.. లొల్లిజేశైనా సమస్య తెంపు!

‘‘పార్టీ ఏదైనా హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ఆదరించారు. సిటీ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతోనే మీకు ఓటు వేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సిటీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జరిగే అసెంబ్లీలో మీరు (సిటీ ఎమ్మెల్యేలు) గళం విప్పితే సర్కారు వింటుంది. అపుడు సమస్యలు పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అందుకే MLA సాబ్ సభలో లొల్లిజేశైనా సమస్యను తెంపు’ అని నగరవాసులు కోరుతున్నారు.
News March 16, 2026
ఈ సినిమాలకు ‘ఆస్కార్’ దాసోహం

అసాధారణ ప్రతిభకు ‘ఆస్కార్’ అవార్డులు దాసోహమయ్యాయి. 13 నామినేషన్లతో బరిలోకి దిగిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఉత్తమ చిత్రం, దర్శకుడితో సహా 6 అవార్డులను కొల్లగొట్టింది. 16 నామినేషన్లతో చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ 4 అవార్డులు గెలుచుకోగా, ‘ఫ్రాంకెన్‌స్టైన్’ 3 సాంకేతిక అవార్డులను దక్కించుకుంది. ఇక ‘కెపాప్ డీమన్ హంటర్స్’ నామినేట్ అయిన 2 విభాగాల్లోనూ విజయం సాధించి 100% రిజల్ట్‌తో అదరగొట్టింది.
News March 16, 2026
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి వరుసగా భృంగి, కైలాస, నంది, అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారు మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, నిజరూప అలంకారాల్లో దర్శనమిస్తారు. ఈ 5 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.


