News November 6, 2025
SV యూనివర్సిటీ ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు

సైకాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ ఎస్. విశ్వనాథ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులను ర్యాగింగ్ చేయించినట్లు యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారణకు రావడంతో వేటుపడింది. ర్యాగింగ్‌పై విద్యార్థుల ఫిర్యాదు మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎస్వీయూ ఏర్పాటు చేసింది. ఇంటరాక్షన్ సెషన్‌లో పేరుతో HOD ర్యాగింగ్ చేయించారని MSc సైకాలజీ విద్యార్థులు(ఫస్ట్ ఇయర్) SPకి PGRSలో ఫిర్యాదు చేశారు.
Similar News
News April 2, 2026
హై కొలెస్ట్రాల్‌కు లక్షణాలు ఉంటాయా?

హై కొలెస్ట్రాల్ బయటకు కనిపించని ప్రమాదం. ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు. కానీ మన శరీరంలో కొన్ని మార్పులు గమనించొచ్చు. కళ్ల దగ్గర పసుపు రంగు మచ్చలు, కొన్ని భాగాల్లో చర్మం కింద కొవ్వు గడ్డలు, కంటి పాప చుట్టూ తెల్లటి రింగ్ కనిపిస్తే అలర్ట్ అవ్వాలి. ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే. బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.
News April 2, 2026
గౌరు ఇంట పెళ్లి సందడి.. హాజరైన సీఎం

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తెతో ఈ వివాహం జరిగింది. నూతన వధూవరులు జనార్దన్ రెడ్డి-సనాతనిని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
News April 2, 2026
తిరుపతి జిల్లా పాఠశాలల్లో సంబరాలు

అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదించిన సందర్భంగా తిరుపతి జిల్లా పాఠశాలల్లో సంబరాలు నిర్వహించారు. మంగళం ట్రెండ్స్ జడ్‌పీహెచ్ స్కూల్‌లో డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కేక్ కట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అని డీఈఓ తెలిపారు.


