News November 6, 2025
కథలాపూర్: సబ్ స్టేషన్‌తో రేడియేషన్ ఉత్పత్తి కాదు: SE సుదర్శనం

కథలాపూర్‌లో నిర్మిస్తోన్న 220/132కేవీ సబ్ స్టేషన్ స్థలాన్ని విద్యుత్ శాఖ SE సుదర్శనం సందర్శించారు. సబ్ స్టేషన్ నిర్మాణంపై కొందరు వ్యక్తులు చేసిన ఆందోళనకు స్పష్టత ఇచ్చారు. విద్యుత్ సబ్‌స్టేషన్లతో ఎలాంటి రేడియేషన్ ఉత్పత్తి కాదనీ, ప్రజల ఆరోగ్యానికి ఏ విధమైన హాని ఉండదని ఆయన తెలిపారు. విద్యుత్ ప్రసార వ్యవస్థల్లో ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్ స్థాయిలు అంతర్జాతీయ ప్రమాణాలకు పూర్తిగా లోబడి ఉంటాయన్నారు.
Similar News
News March 22, 2026
నర్మెట: లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి: మంత్రి తుమ్మల

కనీస మద్దతు ధరతో పాటు వరికి బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నర్మెటలో జరుగుతున్న రైతు సదస్సులు మాట్లాడారు. ‘లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి. మనకు అవసరం ఎక్కువ ఉన్న పంటలకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలనేది సీఎం ఆలోచన అన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రిఫైనరీని కూడా సిద్దిపేట జిల్లాలోనే నిర్మిస్తున్నామన్నారు. ఇదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామన్నారు.
News March 22, 2026
గ్రీన్ ఎనర్జీలో ఏపీ నంబర్-1: సీఎం చంద్రబాబు

భవిష్యత్తులో అన్ని కంపెనీల డేటా సెంటర్లు భారత్‌కే వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. HYD ISBలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏపీకి ఏఐ, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లను తీసుకొచ్చాం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సోలార్, గ్రీన్, విండ్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలో మేమే నంబర్-1’ అని తెలిపారు.
News March 22, 2026
చిత్తూరు జిల్లా SP వినతి

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు SP ఆఫీసు వెల్లడించింది. ఉ.10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు తెలిపారు.


