News November 6, 2025
అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గురువారం తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటిన అనంతరం ఆయన సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్ బాక్స్‌లను స్వయంగా తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కిట్ ఆర్టికల్స్ నిర్వహణలో పరిశుభ్రత, శ్రద్ధ కనబరిచిన కానిస్టేబుల్ జితేందర్‌కు అభినందించి రివార్డును మంజూరు చేశారు.
Similar News
News March 5, 2026
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.
News March 5, 2026
మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.111 కోట్లు విడుదల

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 5,201 ఇళ్లకు రూ.111 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇళ్లను ఆమె స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులు పనులు వేగవంతం చేయాలని, ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు.
News March 4, 2026
మెదక్: రేపటి నుంచి జనగణన శిక్షణకు డీఎస్ఓ

మెదక్ జిల్లా సైన్స్ అధికారి(DSO) రాజిరెడ్డి బుధవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. రేపటి నుండి హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగే జనగణన శిక్షణకు తాను హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే వేసవిలో చేపట్టనున్న మొదటి దశ ఇళ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని రాజిరెడ్డి వెల్లడించారు.


