News November 6, 2025

స్త్రీ నిధి రుణాలు, రికవరీపై కలెక్టర్ సమీక్ష

image

స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పనితీరు, ఆర్థికప్రణాళికలు, రుణాల పంపిణీపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. ఎస్‌హెచ్‌జీల్లో కొత్తసభ్యులను చేర్చుకోవాలన్నారు. మార్చి2026 వరకు జిల్లాలో ఎన్‌పీఏ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి మంగళ,శనివారాలను ‘రికవరీ డే’గా నిర్ణయించి, స్త్రీనిధిలో బ్యాంక్ లింకేజీ, సామాజిక పెట్టుబడి నిధి బకాయిలు లేకుండా చూడాలని సూచించారు.

Similar News

News March 16, 2026

జగిత్యాల: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి

image

జగిత్యాల జిల్లాలో మార్క్‌ఫ్‌డ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు జీవన్ రెడ్డి రైతులతో కలిసి బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.

News March 16, 2026

కృష్ణా: ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. NTR జిల్లాలో 99.24 శాతం, కృష్ణా జిల్లాలో 98.76% మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడా మాస్ కాపీయింగ్, అవాంఛనీయ ఘటనలు జరగలేదని కృష్ణా DEO సుబ్బారావు తెలిపారు. ఓపెన్ టెన్త్ విభాగంలోనూ పరీక్షలు సజావుగా సాగాయని, కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

News March 16, 2026

జగిత్యాల: ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం JGTL కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 57 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత శాఖలు అర్జీలపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు.