News November 6, 2025
KMR: మిడ్ డే మీల్స్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని వినతి

పెండింగ్‌లోని బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. MDM నిర్వహణ కమిటీ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.8 కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.
Similar News
News March 21, 2026
ఇరాన్ ప్రెసిడెంట్‌కు మోదీ ఈద్ శుభాకాంక్షలు

తాను ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు PM మోదీ ట్వీట్ చేశారు. ‘ఆయనకు ఈద్ శుభాకాంక్షలు చెప్పాను. ఈ పండుగ వెస్ట్ ఆసియాలో శాంతి, స్థిరత్వం తీసుకొస్తుందని ఆశించాం. అక్కడి కీలక ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులను ఖండించాను. దీనివల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతిని గ్లోబల్ సప్లై చైన్‌కు అంతరాయం కలుగుతుంది. ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు మద్దతిచ్చినందుకు అభినందించాను’ అని తెలిపారు.
News March 21, 2026
ఎన్టీఆర్ జిల్లాలో సీఐల బదిలీ

ఎన్టీఆర్ జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుణదల సీఐగా సత్య రమేష్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. గుణదలలో ఉన్న వాసిరెడ్డి శ్రీనును సైబర్ క్రైమ్‌కు, అజిత్ సింగ్ నగర్ సీఐగా చంద్రశేఖర్, అజిత్ సింగ్ నగర్‌లో ఉన్న వెంకటేశ్వర్లను సీసీఎస్‌కు అటాచ్ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News March 21, 2026
ఏఐ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో నిర్వహించిన ఏఐ శిక్షణను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూర్తి చేశారు. మార్చి 16–20 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో డిజిటల్ పరిపాలన, కృత్రిమ మేధస్సు వినియోగంపై అవగాహన పొందారు. ఈ శిక్షణతో జిల్లాలో సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు సహాయపడుతుందని తెలిపారు.


