News November 6, 2025

జుట్టుకు రంగు వేస్తున్నారా?.. జాగ్రత్త!

image

పదేపదే హెయిర్ డై లేదా కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ముంబై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అభిషేక్ పిలానీ హెచ్చరించారు. ‘తరచుగా రంగులు వేయడం వల్ల జుట్టులోని కెరాటిన్ దెబ్బతిని పెళుసుగా మారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది. అమోనియా, పెరాక్సైడ్ వంటి తీవ్రమైన రసాయనాలు జుట్టుకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి’ అని పేర్కొన్నారు.

Similar News

News April 6, 2026

తొలి హిందీ సినిమాగా ధురంధర్-2 రికార్డు

image

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్-2 చరిత్ర సృష్టించింది. దేశంలో రూ.1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ఘనత సాధించింది. నిన్న 18వ రోజు దేశవ్యాప్తంగా 4,030లు షోలు పడగా రూ.3.82 కోట్ల నెట్ వసూలు చేసింది. కాగా ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్లు (రూ.1,234 కోట్లు) సాధించిన రికార్డు పుష్ప-2 పేరిట ఉంది. ఆ తర్వాత బాహుబలి-2 రూ.1,030 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

News April 6, 2026

అమెరికా పిచ్చి పనులు చేస్తే.. ఇరాన్ వార్నింగ్

image

మంగళవారం రాత్రి లోగా హార్ముజ్ తెరవకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై సుప్రీం లీడర్ మొజ్తబా అడ్వైజర్ అలీ అక్బర్ దీటుగా స్పందించారు. ‘అమెరికా పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ లాగే బాబ్-అల్-మండెబ్ మూతపడుతుంది’ అని స్పష్టం చేశారు. ఎర్ర సముద్రంలోని బాబ్-అల్-మండెబ్ ఆయిల్, ఇతర వస్తువుల రవాణాకు ఎంతో కీలకం. హార్ముజ్ మూసివేతతో సౌదీ ఇక్కడి నుంచే ఆయిల్ ఎగుమతి చేస్తోంది.

News April 6, 2026

బాసర ఆలయానికి మహర్దశ.. నేడు సీఎం భూమిపూజ

image

TG: బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం పున:నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మ.12 గం.కు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లోని ఒక భాగాన్ని విడుదల చేసింది. 2 వేల చదరపు అడుగుల్లో గర్భాలయం, ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు నిర్మించనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల sft నుంచి 62 వేల sftకి పెంచనున్నారు.