News November 6, 2025

జిల్లా వ్యాప్తంగా వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలు: కలెక్టర్

image

వందేమాతరం జాతీయ గీతం ఆవిష్కరణకు 150 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఏడాది పాటు వందేమాతరం ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది 2026 నవంబర్ 7 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వందేమాతరం గీతం సందేశంలో ప్రాధాన్యతను, విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థలు, స్థానిక సంస్థలను చేర్చాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 15, 2026

దీదీ వర్సెస్ మోదీ.. బెంగాల్‌లో దంగల్

image

బెంగాల్‌లో APR 23, 29న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో కాషాయాన్ని విస్తరిస్తున్న BJP బెంగాల్‌లోనూ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. మోదీ స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరోవైపు TMC చీఫ్ మమతా బెనర్జీ(దీదీ) మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో కమలం వికసించకుండా చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో బెంగాల్‌లో దంగల్ ఫైట్ రసవత్తరంగా మారింది.

News March 15, 2026

వనపర్తి: ఎస్సీ కార్పొరేషన్‌లో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు http://obmms.cgg.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు,వ్యవసాయ పథకాలకు 21-60 ఏళ్లు,శిక్షణా పథకాలకు 18-45 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. 

News March 15, 2026

WGL: రికార్డు ధర పలుకుతున్న నిమ్మకాయ

image

వేసవి కాలంలో చల్లధనం కోసం విపరీతంగా నిమ్మకాయలను వాడుతారు. నిమ్మ మార్కెలో ప్రస్తుతం నిమ్మ బస్తా(23 కిలోల టిక్కి) రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతోందని వ్యాపారులు అంటున్నారు. ఎకరాల్లో నిమ్మ సాగవుతున్నా తెగుళ్ల కారణంగా నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని, మార్కెట్లో రేటు ఉన్నా చేతిలో సరకు లేక పెట్టుబడి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ఒక నిమ్మకాయ రూ.5 పలుకుతుంది.