News November 6, 2025
VZM: ‘రియల్ టైం గవర్నెన్స్‌తో ప్రజలకు చేరువుగా సేవలు’

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు మరింత చేరువవుతున్నాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఎస్పీ పాల్గొన్నారు. నేర నియంత్రణలో టెక్నాలజీ వినియోగంపై సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు అందజేశారన్నారు. ఈ మేరకు అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
Similar News
News March 22, 2026
VZM: రాములోరి కళ్యాణానికి భక్తులకు ఆహ్వానం

మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని, పాల్గొనే వారికి శేషవస్త్రాలు, తలంబ్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.
News March 21, 2026
VZM: ‘క్రమశిక్షణ, సేవాభావంతో ఉన్నత శిఖరాలు సాధ్యం’

మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్‌సీసీ విద్యార్థులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్‌సీసీ ద్వారా సేవాభావం పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
News March 20, 2026
గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి: VZM కలెక్టర్

జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన VC అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయకుండా, పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్-సప్లై అంతరాన్ని తగ్గించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.


