News April 11, 2024

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

image

AP: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్ రావు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ఓ బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ఉ.5 గంటలకు డ్యూటీ‌కి హాజరై ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News December 25, 2025

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందు బాబులకు అలర్ట్

image

TG: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మందు కొట్టి విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలతో తిరిగే వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు వెహికల్ సీజ్, గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాల్లో 304 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Share it

News December 25, 2025

వ్యాధుల ముప్పు కోళ్లలో తగ్గాలంటే?

image

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.

News December 25, 2025

పెట్రోలియం జెల్లీతో ఎన్నో లాభాలు

image

పెట్రోలియం జెల్లీని సాధారణంగా కాళ్లు, చేతులు పగలకుండా రాసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. * పర్ఫ్యూమ్ రాసుకునే ముందు కొంచెం పెట్రోలియం జెల్లీని చర్మంపై రాసుకోవడం వల్ల పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉంటుంది. * చిట్లిన వెంట్రుకలకు తరచుగా వాజిలిన్ రాసుకోవడం వల్ల వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. * మీ ఇంట్లో పెంపుడు జంతువుల పాదాలకు రోజూ కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే అవి సురక్షితంగా ఉంటాయి.