News November 6, 2025

RPT: పొలంలో కరెంటు తీగలు తగిలి వృద్ధుడు మృతి

image

పొలంలో కరెంటు తీగలు తగిలి వృద్ధుడు మృతి చెందిన ఘటన రామన్నపేట PS పరిధిలో జరిగింది. తుమ్మలగూడెంలో గోర్లా మల్లయ్య(75) NOV 5న గేదెలను మేపడానికెళ్లి ఇంటికి రాలేదు. మనవళ్లు, గ్రామస్థులు వెతికినా జాడలేదు. గురువారం ఉదయం గర్దాసు శ్రీను బావి వద్ద అతను, గేదె చనిపోయి కనిపించారు. తీగలకు తగిలి మరణించాడని భార్య ఫిర్యాదు చేసింది. రామన్నపేటలో పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని అప్పజెప్పినట్లు SI నాగరాజు తెలిపారు.

Similar News

News March 12, 2026

‘జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

image

జిల్లాలో శనగల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జేసీ అశుతోష్ శ్రీవాత్సవకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం శనగ పంటకు క్వింటాకు రూ.5,875 ఉన్నా మార్కెట్లో రూ4,500 మాత్రమే ధర లభిస్తుందని జేసీకి వివరించారు. కొనుగోళ్ల కేంద్రాలను పెంచి సమస్యను పరిష్కరించాలన్నారు. వినతి ఇచ్చినవారిలో తిరుపతిరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

News March 12, 2026

కాకినాడ MP ప్రశ్నకు కేంద్రమంత్రి రిప్లై.. ఏమన్నారంటే?

image

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి గట్కరి తెలిపారు. గురువారం కాకినాడ MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల సహకారంతో భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

News March 12, 2026

GWL: భూసేకరణ పూర్తి అయితేనే ప్రాజెక్టుల పనులు వేగవంతం

image

గద్వాల జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసేందుకు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్అండ్ఆర్ కమీషనర్ శివకుమార్ నాయుడు పేర్కొన్నారు. గురువారం IDOC మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలో ఇంకా 541 ఎకరాల భూ సేకరణ సర్వే స్థాయిలో ఉందని దాన్ని పూర్తి చేస్తే ప్రభుత్వం డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు.