News November 6, 2025

HYD: 108వ భారత ఆర్థిక సంఘం బ్రోచర్ విడుదల

image

108వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సు బ్రోచర్‌ను ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని EC గదిలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం విడుదల చేశారు. ఈ సదస్సు డిసెంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు భారత ఆర్థికవ్యవస్థను ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, విధాన నిర్వాహకులు, పరిశోధకులను ఒకే వేదికపై తీసుకురానుంది.

Similar News

News March 18, 2026

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గాలులు.. విమానం దారి మళ్లింపు

image

గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఈదురుగాలులు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయిన వెంటనే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశారు. విమానం కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టి, అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ గన్నవరం బయల్దేరి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.

News March 18, 2026

SRPT: ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే!

image

జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ వద్ద నమోదు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డా. పెండెం వెంకటరమణ ఆదేశించారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ప్రాక్టీస్ చేయడం నేరమని స్పష్టం చేశారు. గడువు ముగిసిన సంస్థలు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 18, 2026

అనంతపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

image

అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన GO 284 ప్రకారం ఈ నియామకం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించి, పౌరులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు.