News November 6, 2025

అన్ని కార్యాలయాల్లో రేపు సామూహిక వందేమాతరం

image

బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయాలని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7 జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News April 4, 2026

రాష్ట్ర స్థాయి పోరుకు జిల్లా రగ్బీ జట్లు సిద్ధం

image

రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఉమ్మడి తూ.గో జిల్లా నుంచి 24 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. శనివారం పిఠాపురం జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో మొత్తం 53 మంది పాల్గొన్నారు. వీరిలో 12 మంది పురుషులు, 12 మంది మహిళా క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి పి.లక్ష్మణరావు తెలిపారు. ఎంపికైన వారు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి టోర్నీలో జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

News April 4, 2026

SU: B.Tech పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని B.Tech 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా.డి.సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.satavahana.ac.in లేదా https://satavahana.in/SUResultsAutomation/Result/GetGrade/qUNRKU3Xukc%3d ను సందర్శించాలని సూచించారు.

News April 4, 2026

18వ స్థానంలో గుంటూరు జిల్లా

image

ఫిబ్రవరి 2026కు సంబంధించిన పీహెచ్‌సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో గుంటూరు జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 24 పీహెచ్‌సీలలో 1 A గ్రేడ్, 13 B, 8 C, 2 D గ్రేడ్‌లు సాధించాయి. మొత్తం 120 మార్కుల్లో 85 మార్కులు పొందింది. వెనుకబడిన ప్రాంతాల్లో సేవల మెరుగుదల అవసరం ఉన్నప్పటికీ, మొత్తం ఆరోగ్య సేవల నాణ్యత క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.