News November 6, 2025

హుజూరాబాద్ ప్రజలతో 25 ఏళ్ల అనుబంధం ఉంది: ఈటల

image

హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో గురువారం బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొస్తానని, ఇక్కడి ప్రజలతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్నారు.

Similar News

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 11, 2026

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

image

గత రెండు వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూముల వివాదంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాల ఆందోళనలతో ఎక్కడైతే ఇళ్లు కూల్చారో, అక్కడే 9 ఎకరాల్లో లేఅవుట్‌ చేసి 311 మంది బాధితులకు 75 గజాల చొప్పున పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో నేడు పట్టాల పంపిణీ చేపట్టనుంది. ఈ పరిణామం ప్రభుత్వానికి ఎంతవరకు మైలేజీ ఇస్తుందో వేచి చూడాలి.

News March 11, 2026

చిన్న సంస్థ.. పెద్ద దెబ్బ: అమెరికా యుద్ధ రహస్యాలు లీక్

image

చైనాకు చెందిన మిజార్‌విజన్ అనే చిన్న సంస్థ AI సాయంతో అమెరికా యుద్ధ వ్యూహాలను బట్టబయలు చేసింది. ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్, సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల హై-రిజల్యూషన్ ఫొటోలను ఈ సంస్థ SMలో విడుదల చేసింది. జిలిన్-1 ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఈ సమాచారం ఇరాన్ దాడులకు పరోక్షంగా సహకరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.