News November 6, 2025

NRPT: బాల్య వివాహం సమస్యను అదిగమిద్దాం: కలెక్టర్

image

దేశ పౌరుల సామాజిక బాధ్యతగా భావించి బాల్య వివాహాలు అనే సామాజిక సమస్యను అధిగమించాలని శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ఎస్ఆర్ గార్డెన్‌లో పూజారులు, పాస్టర్లు, క్వాజీలు, ప్రింటింగ్ ప్రెస్, ఫంక్షన్ హాల్, డీజే నిర్వాహకులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాల రహిత సమాజం కోసం కృషి చేద్దామన్నారు.

Similar News

News March 18, 2026

GNT: టెన్త్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

image

వట్టిచెరుకూరు బీసీ హాస్టల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని హాస్టల్ యాజమాన్యానికి సూచించారు. మార్కులే జీవితంలో ముఖ్యం కాదని చెప్పారు.

News March 18, 2026

రేపే ఉగాది.. ఇలా చేస్తే మంచిది!

image

తెలుగు క్యాలెండర్ ప్రకారం ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరం రేపు ప్రారంభంకానుంది. ఇది గతాన్ని విశ్లేషించుకొని కొత్త విజయాల వైపు సాగాలని సూచిస్తుంది. సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి, ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పంచాంగ శ్రవణం వినడం వల్ల నూతన సంవత్సర రాశిఫలాలు, గ్రహాల ప్రభావం తెలుస్తుంది. గుమ్మాలకు పసుపు, కుంకుమ రాసి ముగ్గులు వేయాలి. ఇష్ట దైవానికి పూజ చేసి దానం చేయడం శుభప్రదం. SHARE IT

News March 18, 2026

మేడేపల్లి: పిడుగుపాటుకు యువకుడు బలి

image

ఆత్మకూరు మండలం మేడేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం సమయంలో మిర్చి చేను వద్దకు వెళ్లిన గొల్ల రాములు (25) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని సర్పంచ్ రాయుడు తెలిపారు. యువకుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.