News November 6, 2025
నంద్యాల: గమ్యం చేరాలంటే సాహసం చేయాల్సిందే..!

మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకడం కష్టంగా మారింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు పని నిమిత్తం వెళ్లే వారికి అవస్థలు ఎదురవుతున్నాయి. బస్సుల్లో సీట్లు దొరకకపోవడంతో ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీ, ఇన్నీ కావు. ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని తెలిసినా గమ్యం చేరడానికి సాహసం చేయక తప్పడం లేదు.
Similar News
News March 23, 2026
హైకోర్టులో 300 పోస్టులకు నోటిఫికేషన్

AP: రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 19వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.20,000-1,47,760. విద్యార్హతలు, ఇతర వివరాలకు వెబ్‌సైట్: <
News March 23, 2026
సూర్యాపేట: ‘పోలీసు కుటుంబానికి ఎస్పీ భరోసా’

అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ జూనైద్ కుటుంబానికి సిద్దిపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ సోమవారం రూ. 2 లక్షల ‘పోలీసు చేయూత’ చెక్కును అందజేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తోటి ఉద్యోగుల విరాళాలతో ఈ పథకం కొనసాగడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ రామారావు, సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్ పాల్గొన్నారు.
News March 23, 2026
సిరిసిల్లలో ప్రజావాణికి 167 ఫిర్యాదులు

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం అని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి 167 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ఒక్క ఫిర్యాదును కూడా పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


