News November 6, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

image

మంథని నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కింగ్ చేసిన ఇళ్లు, బేస్మెంట్ స్థాయికి చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేయాలని ఆదేశించారు. పెట్టుబడి సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని సూచించారు. నిర్మాణ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 21, 2026

పోల్కంపల్లి సుజాతకు ‘రైతు నేస్తం’ అవార్డు

image

గుంటూరులో జరిగిన రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో వనపర్తికి చెందిన పోల్కంపల్లి సుజాత అవార్డు అందుకున్నారు. మిద్దె తోటల పెంపకంలో ఆమె కనబరిచిన ప్రతిభకు గానూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పలువురు సేంద్రియ రైతులు సుజాతను అభినందించారు.

News March 21, 2026

23న ఈ కార్యక్రమాలు రద్దు: కాకినాడ కలెక్టర్

image

ఈ నెల 23న కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలవల్ల రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

News March 21, 2026

శిరసనగండ్ల సీతారాముని దర్శించుకున్న మంత్రి

image

తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శిరసనగండ్ల సీతారామ చంద్రస్వామి దేవస్థానాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.