News November 7, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే
> బ్రిడ్జ్ నిర్మించాలని సీపీఎం నేతల ధర్నా
> విద్యార్థులతో వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే కడియం
> వరి పంటలను పరిశీలించిన కలెక్టర్
> బచ్చన్నపేట: డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
> జనగామలో డివైఎఫ్ఐ 46వ దినోత్సవ వేడుకలు
> కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

Similar News

News April 6, 2026

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడికి జీవితఖైదు

image

హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చీఫ్ అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2003, జూన్ 4న NCP నాయకుడు విద్యాచరణ్ శుక్లా సన్నిహితుడైన రామావతార్ జగ్గీని పట్టపగలు కాల్చి చంపారు. ఈ కేసులో అమిత్ సహా 31 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత పలువురికి కోర్టులో ఊరట లభించింది.

News April 6, 2026

త్వరలో సినిమాలకు త్రిష గుడ్‌బై?

image

TVK చీఫ్, హీరో విజయ్‌తో రిలేషన్‌పై రూమర్స్ నడుస్తున్న వేళ నటి త్రిష‌పై సినీవర్గాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌పై చెప్పే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ప్రేమ గురించి ఆమె ఇటీవల <<19575762>>ఇన్‌స్టాలో<<>> షేర్ చేసిన పోస్ట్‌తో ఇది మొదలైంది. ఇక రీసెంట్‌గా ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పకపోవడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. అయితే దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది.

News April 6, 2026

వేములవాడ: లడ్డు గోదామును తనిఖీ చేసిన ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవో

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (భీమేశ్వర) ఆలయంలో లడ్డు కౌంటర్, గోదాములను ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవో అంజనారెడ్డి పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న లడ్డూల నాణ్యత, ధరలు, పంపిణీ విధానంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. లడ్డు తయారీ, నిల్వ విధానం, శుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారా అని తెలుసుకున్నారు. అలాగే పూజా స్టోర్‌లో విక్రయిస్తున్న సామగ్రి ధరలు, నాణ్యత వివరాలను ఆరా తీశారు.