News November 7, 2025
RGM: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి: CI

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. NTPC పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచి ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో మంచి నడవడికతో ఉండాలని సూచించారు. NTPC- SIఉదయ్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 11, 2026
అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

దేశంలో నెలకొన్న వంట గ్యాస్ కొరత అయోధ్యనూ తాకింది. రామమందిరం సమీపాన ఉండే అమావా ఆలయంలోని ప్రముఖ నిత్యాన్నదాన ప్రాంగణం రామ్ రసోయ్‌లో తాత్కాలికంగా అన్నదానం నిలిపివేశారు. అయోధ్యకు వచ్చే యాత్రికుల్లో వేలాది మందికి ఈ రామ్ రసోయ్ ప్రసాదాన్ని అందిస్తుంది. కాగా LPGకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని <<19316913>>TTD<<>> ఇప్పటికే IOCLను కోరింది.
News March 11, 2026
నడిగూడెం: పౌరులంతా భాగస్వాములు కావాలి: SP

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నేరాల నివారణ, మహిళల భద్రత, సైబర్ మోసాలపై సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ.. సమాజంలో నేరాలను అరికట్టడంలో పౌరుల బాధ్యత కీలకమని పేర్కొన్నారు.
News March 11, 2026
VZM: ‘హౌసింగ్ ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

రాష్ట్రంలో 500 చదరపు మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్లు పైబడిన ప్రతి హౌసింగ్ ప్రాజెక్ట్ తప్పనిసరిగా ఏపీ రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీ రెరా ఛైర్మన్ ఆర్.ఎస్. శివారెడ్డి తెలిపారు. పట్టణంలోని ఓ హోటల్‌లో రెరా చట్టం–2016పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రెరా చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.


