News November 7, 2025

పొగాకు రైతులకు న్యాయం చేద్దాం: కలెక్టర్

image

ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి బాపట్ల కలెక్టరేట్‌ వద్ద మార్కుఫెడ్ డిఎం, పొగాకు ఫ్యాక్టరీల యాజమాన్యంతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని వివరించారు.

Similar News

News April 1, 2026

అల్లూరి: పురిటినొప్పులతోనే మూడు కి.మీల డోలి ప్రయాణం

image

అల్లూరి జిల్లాలో డోలి మోతలు తప్పడం లేదు. డుంబ్రిగుడ మండలం, కొల్లాపుట్టు పంచాయతీ డొకిరిపాడు గ్రామానికి చెంది పాంగి డొమినికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రోడ్డు లేక పురిటినొప్పులతో ఉన్న డొమినిని కుటుంబ సభ్యులు, బందువులు మూడు కి.మీలు డోలీ మోశారు. అంబులెన్స్ అందుబాటులో లేక, ఆటో‌లో అరకు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బొడ్లమామిడి, డొకిరిపాడు, నిట్టమామిడి గ్రామాలకు రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు

News April 1, 2026

బీర్లు తెగ తాగేస్తున్నారు..

image

​కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కర్నూలు జిల్లాలో ఐఎంఎల్ 54 శాతం, బీర్ 88 శాతం వృద్ధితో రూ.1143.82 కోట్ల ఆదాయం లభించింది. నంద్యాల జిల్లాలో ఐఎంఎల్ 18 శాతం, బీర్ 88 శాతం వృద్ధి నమోదు కావడంతో రూ.971.52 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కర్నూలు జిల్లాలో 34 శాతం, నంద్యాల జిల్లాలో 8 శాతం మేర ఆదాయం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

News April 1, 2026

రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.