News November 7, 2025
TU: యూనివర్సిటీలో నియామకాల రద్దు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 నియామక ప్రక్రియలో నోటిఫికేషన్ నం.1/2012, 2/2012లో రోస్టర్ పాయింట్‌లు సరిగ్గా పాటించలేదని తెలంగాణ హై కోర్టు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త నోటిఫికేషన్‌లు ఇవ్వాలని యూనివర్సిటీకి సిఫార్సు చేసింది. దాదాపు 12 సం.ల అనంతరం 24 పేజీల తీర్పు వెలువరించింది. అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాసూటికల్, కెమిస్ట్రీ విభాగాలకు పాలకమండలి అనుమతి లేదని తెలిపింది.
Similar News
News March 7, 2026
నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్‌గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్‌లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్‌తో పోటీ పడుతున్నాయి.
News March 7, 2026
నిర్మల్: భరోసా కల్పించి.. 133 జంటలను కలిపారు

నిర్మల్ జిల్లాలోని భరోసా కేంద్రం ద్వారా కుటుంబ సమస్యలు, చిన్న చిన్న మనస్పర్థలు, క్షణికావేశంతో దూరంగా ఉన్న133 జంటలను జిల్లా పోలీసులు ఒక్కటి చేశారు. భరోసా కేంద్రంలో భార్యాభర్తలకు నిశ్నాతుల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో సమస్యలను ఓపిగ్గా విని కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాలను మళ్లీ కలిపేలా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.
News March 7, 2026
జనగామ: 99 రోజుల కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో నిర్వహించే 99 రోజుల కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను పరిశీలిస్తూ, కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


