News November 7, 2025

NTR: కిడ్నీ బాధితులకు కృష్ణా జలాల సరఫరా సప్లై ట్రయల్ రన్.!

image

NTR (D) తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు ప్రాంత కిడ్నీ బాధితులకు కృష్ణా నది జలాలను అందించేందుకు అధికారులు ట్రయల్ రన్ ప్రారంభించారు. 38 గ్రామాల్లో కిడ్నీ సమస్యలున్న 52 వేల మందికి ఫ్లోరైడ్ రహిత నీటిని అందించే ఈ బృహత్తర ప్రాజెక్టులో పనులు తుది దశకు చేరాయి. ప్రస్తుతం 14 ప్రాంతాలకు నీటి సరఫరా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. DEC-JAN నాటికి పూర్తిస్థాయిలో నీరు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

Similar News

News March 14, 2026

మెట్‌పల్లి: క్వింటాల్ పసుపు @13,524

image

మెట్‌పల్లి మార్కెట్‌లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ.13,524, కనిష్ఠం రూ. 9,009; పసుపు గోళ గరిష్ఠం రూ.12,222, కనిష్ఠం రూ. 8,808; పసుపు చూర గరిష్ఠం రూ.10,523, కనిష్ఠం రూ.8,686గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మార్కెట్‌లో మొత్తం 1,024 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయన్నారు.

News March 14, 2026

NGKL: అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభం

image

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ ద్వితీయ, నాల్గవ, ఆరో సెమిస్టర్ తరగతులు మార్చి 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రతి ఆదివారం, రెండో శనివారం రోజుల్లో తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరై తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు కళాశాల అంబేడ్కర్ =అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.

News March 14, 2026

గ్యాస్ సిలిండర్ల సప్లై.. వికారాబాద్ కలెక్టర్ హెచ్చరిక

image

వికారాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ కొరత లేదని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. విద్యాలయాలు, గృహాలు, ఆసుపత్రులకు ఎల్పీజీ గ్యాస్ సప్లై సరైన విధంగా సాగుతుందన్నారు. బ్లాక్ మార్కెట్లకు తరలించి గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అక్రమ దారి మళ్లింపును పర్యవేక్షించేందుకు ఐదు టీంలను ఏర్పాటు చేశారు.