News November 7, 2025
‘వందేమాతరం గీతం’ వార్షికోత్సవం నిర్వహించాలి: కలెక్టర్

దేశభక్తి గీతం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2025 ప్రకారం, జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ఒకే సమయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచనలు జారీ చేశారు.
Similar News
News April 9, 2026
చాగల్లు: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ ఘాతంతో బొంతు వంశీ (25) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల సమాచారం.. చాగల్లు మండలం చిక్కాలపాలెం వద్ద కొబ్బరి ఆకులు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 9, 2026
ప్రకృతి వ్యవసాయంతోనే భూసార రక్షణ: కలెక్టర్

రాజమండ్రి కలెక్టరేట్‌లో APCNF ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని కోరారు. పంటల వైవిధ్యం పాటించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని శిక్షణ పొందుతున్న వారికి దిశానిర్దేశం చేశారు.
News April 9, 2026
కొవ్వూరు: తప్పించుకు తిరుగుతూ.. చివరికి చిక్కి..

దొంగతనం కేసులో బెయిల్‌పై వచ్చి, కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్థుడు ఎండ్రగుత్తి రామరాజును ఎస్సై మనోహర్ అరెస్ట్ చేశారు. లక్కవరం గ్రామానికి చెందిన ఇతనిపై కొవ్వూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. దీంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు, శనివారం కోర్టులో హాజరుపరిచారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.


