News November 7, 2025

జగిత్యాల: ITI అభ్యర్థులకు జాతీయ అప్రెంటిషిప్ అవకాశాలు

image

జగిత్యాల పరిసర ప్రాంతాల ITI పాసైన అభ్యర్థుల కోసం PM National Apprenticeship Mela ఈనెల 10న ప్రభుత్వ ITI ధరూర్ క్యాంప్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. L&T,వరుణ్ మోటార్స్,స్కెండర్ ఎలక్ట్రికల్స్,టాటా మోటార్స్,MRF Hyderabad ప్రతినిధులు హాజరు కానున్నారని ప్రిన్సిపల్ గంట్యాల రవీందర్ తెలిపారు.అభ్యర్థులు Apprenticeship రిజిస్ట్రేషన్, SSC, ITI సర్టిఫికేట్, TC, ఆధార్ జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.

Similar News

News March 25, 2026

రంగారెడ్డి: మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం

image

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 24,46,265 మంది ఉండగా, 2024 డిసెంబర్ నాటికి కేవలం 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్యే 35,91,987కు చేరడం గమనార్హం. వీరిలో 526 గ్రామ పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, 6 మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఉన్నారు.

News March 25, 2026

ఇంధన సమస్యపై నేడు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. నేడు సభలో ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై చర్చించేందుకు BRS సిద్ధమైంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసన సభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.

News March 25, 2026

ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్ మహిళ!

image

విజయవాడ <<19463245>>ఉగ్రకుట్ర<<>> కేసులో హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సయిదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ ద్వారా యువతను తీవ్రవాద సంస్థలవైపు మళ్లించడంలో సయిదా కీలక పాత్ర పోషించింది. ఇటీవల పట్టుబడ్డ సోహైల్ బేగ్, షరీఫ్, డ్యానిష్‌ను కూడా ఈమెనే ఉచ్చులోకి తీసుకొచ్చింది. విజయవాడకు తరలించి సయిదా బేగంను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.