News November 7, 2025
కడప: శ్రీ చరణికి రూ.10 లక్షలు ప్రకటించిన ఎంపీ మేడా

వరల్డ్ కప్‌లో సత్తా చాటిన ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణికి రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన చరణి చూపిన ప్రతిభ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ బహుమతి ప్రకటించానని ఆయన చెప్పారు.
Similar News
News March 14, 2026
ఇంటింటికీ కొళాయి.. రూ.860 కోట్లు మంజూరు

ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా తాగునీరు అందించేందుకు రూ.860 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉరవకొండకు రూ.480 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గానికి రూ.380 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పయ్యావుల తెలిపారు. ఎన్నికల ముందు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన CM చంద్రబాబు తాగునీటి సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ మేరకు భారీగా నిధులు ఇచ్చారు.
News March 14, 2026
విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
News March 14, 2026
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షe కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 BNSS (144) అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధించగా, 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.


