News November 7, 2025
సంగారెడ్డి: ఈనెల 20 నుంచి బడి బయట పిల్లల సర్వే

జిల్లాలో ఈనెల 20 నుంచి 31 డిసెంబర్ వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల పరిధిలోని గ్రామాల్లో, ఆవాస ప్రాంతాల్లో 6-14 సంవత్సరాలలోపు బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రబంధ పోర్టర్లో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News March 12, 2026
కర్నూలులో 261 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 4,590 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4329 మంది మాత్రమే పరీక్ష రాశారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
News March 12, 2026
కిడ్నీలను కాపాడుకుందామా!

నేడు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు, చక్కెర తగ్గించాలి. బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. SHARE IT
News March 12, 2026
సంగారెడ్డి: 730 మంది విద్యార్థులు గైర్హాజరు

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 18,911 మంది విద్యార్థులకు గాను 18,181 మంది (96.14%) హాజరయ్యారని, 730 మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు.


