News November 7, 2025
అనకాపల్లి రైలు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

దక్షిణ రైల్వే ప్రకటించిన పండగ ప్రత్యేక రైళ్లకు అదనపు హాల్ట్‌లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. భువనేశ్వర్ – బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైళ్లకు అనకాపల్లితో పాటు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్ స్టాప్‌లు కల్పించారు. అరకు – యలహంక, శ్రీకాకుళం రోడ్-బెంగళూరు కంటోన్మెంట్, సంబల్పూర్, కటక్ ప్రత్యేక రైళ్లకు కూడా అదనపు నిలుపుదల చేస్తూ గురువారం అధికారులు ప్రకటించారు.
Similar News
News March 12, 2026
ఖమ్మం: ఇఫ్తార్ విందులో మంత్రి తుమ్మల

ఖమ్మం నగరంలోని తుమ్మలగడ్డలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తన కుటుంబంలో జరిగిన ఒక దురదృష్టకర పరిస్థితుల వల్లే తాను గత వారం రోజులుగా దుబాయ్‌లో ఉండాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. అయితే ఆ సమయంలోనూ అబుదాబిలో భారతీయ ముస్లింలు ఎంతో నిష్టతో రంజాన్ మాసాన్ని పాటిస్తున్న తీరును గమనించానని పేర్కొన్నారు.
News March 12, 2026
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <
News March 12, 2026
దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.


