News November 7, 2025
వనపర్తిలో నవంబర్ 10న అప్రెంటీషిప్ మేళా

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నవంబర్ 10న అప్రెంటిషిప్ మేళా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కే.రమేష్ బాబు తెలిపారు. ఐటీఐ పాస్ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్ధులు అప్రెంటిస్ షిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాకు ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. వివరాలకు ట్రైనింగ్ ఆఫీసర్ ఎంఈ హక్‌ను లేదా సెల్ నంబర్లను 9849244030, 9490202037 సంప్రదించాలన్నారు.
Similar News
News November 7, 2025
విజయవాడ: బంగారం ఆశ చూపి.. రూ.8 లక్షలు స్వాహా!

తెలంగాణలోని చౌటుప్పల్‌కు చెందిన హోటల్ యజమాని బ్రహ్మయ్యను మోసం చేసి రూ.8 లక్షలు కాజేశారు ఇద్దరు కేటుగాళ్లు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలికి వంశీ, ప్రసాద్ అనే వ్యక్తులు విజయవాడకు రప్పించి, నగదు తీసుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భవానిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 7, 2025
నల్గొండ: తాను చనిపోయినా మరొకరికి వెలుగు!

నల్గొండ పట్టణం హైటెక్ సిటీ కాలనీకి చెందిన వైద్యం దయాకర్ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు దయాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి అనుమతితో దయాకర్ నేత్రాలు సేకరించారు. దయాకర్ నిడమనూరు మండలం ధర్మారం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. దయాకర్ తాను మరణించినప్పటికీ మరొకరికి వెలుగునిచ్చారని ఆయనను గుర్తుచేసుకుంటూ బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
News November 7, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఆచార్య NG రంగా 125వ జయంత్యుత్సవాలకు హాజరుకానున్న CM చంద్రబాబు
* వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రధాని పిలుపు మేరకు ఉ.9.50 గం.కు ప్రతి ఒక్కరం గేయాన్ని ఆలపిద్దాం: పవన్
* HYDలో జన్మించిన గజాలా హష్మీ వర్జీనియా గవర్నర్ కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం: CM చంద్రబాబు
* పోలవరం ప్రాజెక్ట్‌పై ఆ ప్రాజెక్ట్ అథారిటీ రెండ్రోజుల సమీక్ష. నేడు HYDలోని కార్యాలయంలో, రేపు ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన


