News November 7, 2025
ఏటూరునాగారం ఫారెస్ట్‌లో సీతాకోక చిలుకల సర్వే

ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ అభయారణ్యం పరిసరాలలో సీతాకోకచిలుకలు, చిమ్మెటలపై సర్వే గురువారం ప్రారంభమైంది. అడవుల విస్తరణ, పునరుత్పత్తికి దోహదపడే వీటి సంతతి, మనుగడపై ఈ సర్వే ఈనెల 9 వరకు జరగనుంది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వేను డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 33 మంది నిపుణులు పాల్గొంటున్నారు.
Similar News
News March 22, 2026
కుందాలపల్లి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

పి.గన్నవరం మండలం కుందాలపల్లిలో దళితుడు కాట్రు శ్రీనివాస్ మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తుండగా అడ్డుకున్న ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ సుమోటోగా స్వీకరించి శనివారం అధికారులకు నోటీసులు జారీ చేసింది. రోడ్డుపై వేసిన పెళ్లి పందిరిలో నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లడాన్ని ఒక వర్గం అడ్డుకోవడం, ఎస్సీ వర్గంపై దూషణలకు దిగటం వంటి ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు నోటీసులు జారీచేశారు.
News March 22, 2026
రేపే మిట్టల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్‌కు CM చంద్రబాబు రేపు శంకుస్థాపన చేస్తారు. రూ.1,47,162CR పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 60-65వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మొదటి దశలో 7.3MT, రెండో దశలో 10.5MT ఉత్పత్తి.. 2033 నాటికి ప్లాంట్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.
News March 22, 2026
కాఫీ ఇలా తాగితే ఆరోగ్యం పక్కా!

చాలామంది కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. కానీ ఫిల్టర్ చేసిన బ్లాక్ కాఫీ లివర్, గట్ హెల్త్‌కు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రలేచిన 60 నుంచి 90 నిమిషాల తర్వాత తాగడం బెస్ట్ టైమ్. రోజుకు 1-3 కప్పుల వరకు ఓకే. చక్కెర కలపకుండా తాగడం ముఖ్యం. అలాగే ఖాళీ కడుపుతో తాగొద్దు. ఆర్గానిక్ కాఫీ గింజలైతే బ్రెయిన్ షార్ప్‌గా ఉండటమే కాకుండా అల్జీమర్స్ వంటి రిస్కులు తగ్గుతాయి.


