News November 7, 2025
నంద్యాల మీదుగా స్పెషల్ రైళ్లు

నంద్యాల జిల్లా అయ్యప్ప స్వాములు, ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నంద్యాల మీదుగా కేరళలోని శబరిమలైకి 10 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గురువారం తెలిపారు. మచిలీపట్నం నుంచి కొల్లం వరకు 5 ప్రత్యేక రైళ్లు, కొల్లం నుంచి నంద్యాల వైపు 5 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ అధికారులకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 31, 2026
ఈనాటి ముఖ్యాంశాలు

➤ భారత్ ఇప్పుడు మావోయిస్టు రహిత దేశం: అమిత్ షా
➤ SSY, PPF వడ్డీ రేట్లు యథాతథం
➤ భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్
➤ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CBNకు ఊరట
➤ మావోయిస్టు ఫ్రీ రాష్ట్రంగా ఏపీ: DGP
➤ సన్నబియ్యంతో లంచ్ చేసిన సీఎం, TG MLAలు
➤ KCRను గృహ నిర్బంధం చేశారని నా అనుమానం: CM రేవంత్
➤ IPL: RRపై చిత్తుగా ఓడిన CSK
News March 31, 2026
ప్రొటీన్ కోసం ఈ ఆహారాలు తీసుకోండి: నిపుణులు

శాకాహారులు ప్రొటీన్ కోసం పనీర్, పప్పులపైనే ఆధారపడకుండా ఇతర ఆహారాలనూ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు, టోఫు (సోయాబీన్స్ నుంచి తయారు చేస్తారు), టెంపే, పచ్చి సోయా గింజలు, హంగ్ కర్డ్, రాజ్‌గిరా, జనపనార గింజలు (ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వులు, ఖనిజాలు అధికంగా ఉంటాయి) ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటి వల్ల జీవక్రియ మెరుగుపడటం, కొవ్వు తగ్గడంతో పాటు అనేక లాభాలున్నాయని అంటున్నారు.
News March 31, 2026
కేయూ బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు ఇవే

* కేయూ బడ్జెట్ రూ.331.99 కోట్లు
* ఖర్చులు రూ.355.90కోట్లు
* లోటు బడ్జెట్ రూ.2.16కోట్లు
* పరిశోధన పెంపు కోసం వైస్ ఛాన్స్‌లర్ అవార్డులు
*130 పార్ట్ టైం నియామకాలు
* టీహ బ్ లా కేయూ హబ్
* 2029 న్యాక్ అక్రిడిటేషన్ కోసం ప్రణాళికలు
* హాస్టల్లో లోటుపాట్లు సవరించడానికి అమల్లోకి హాస్టల్ మేనేజ్మెంట్ విధానం
* వందకు పైగా స్టార్ట్ అప్‌లు తీసుకురావడానికి కృషి


