News April 11, 2024

కరీంనగర్: నిబంధనలు పాటించని ఉపాధ్యాయుడి సస్పెండ్

image

కరీంనగర్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో నిబంధనలు పాటించని కరీంనగర్ సవరన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు పండిట్ ఆర్. చంద్రశేఖర్ రావును సస్పెండ్ చేశారు. మూల్యాంకన విధుల్లో చరవాణి మాట్లాడుతున్నందుకు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ క్యాంపు ఆఫీసర్, డిఇఓ జనార్దన్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News March 3, 2026

ముఖ్యమంత్రి సదస్సులో కరీంనగర్ కలెక్టర్

image

హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ప్రధానంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.

News March 2, 2026

హోలీ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం

image

రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని KNR జిల్లా ప్రజలకు సీపీ గౌష్ ఆలం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సౌహార్దానికి, సోదరభావానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో చట్టబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కమిషనరేట్ పరిధిలో పలు సూచనలు జారీ చేశారు. చర్మం, కళ్లకు హాని చేసే రసాయనిక రంగులను కాకుండా, సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వాడాలని సూచించారు.

News March 2, 2026

హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

image

హోలీ పండగను ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. బలవంతంగా రంగులు పూసినా, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైతే ‘డయల్ 100’కు కాల్ చేయాలని తెలిపారు.