News November 7, 2025
రబీ సాగుకు అనువైన మరికొన్ని వరి రకాలు

M.T.U 3626 ( ప్రభాత్), M.T.U 1121( శ్రీ ధృతి), M.T.U.1282, M.T.U.1290, N.L.R 34449(నెల్లూరు మషూరి – మిక్కిలి సన్నగింజ రకం), N.L.R 3354( నెల్లూరు ధాన్య రాశి), N.L.R 40054(నెల్లూరు సుగంధ) ఈ వరి రకాలు కూడా రబీ సాగుకు అనుకూలమే. వీటి పంట కాలం 120 నుంచి 125 రోజులు. వీటిలో చాలావి మధ్యస్త సన్నం, సన్న గింజ రకాలే. ఇవి చేనుపై పడిపోవు. అగ్గి తెగులును తట్టుకుంటాయి. నిపుణుల సూచనలతో వీటిని విత్తుకోండి.
Similar News
News November 11, 2025
ప్రకాశం జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే.!

ఇవాళ CM చంద్రబాబు జిల్లాలోని పెద్ద చెర్లో పల్లి (M) పెద ఇర్లపాడులోని MSME పార్కుల ప్రారంభోత్సవానికి రానున్నారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 10:15 కు ఇర్లపాడులోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 10:35 గంటలకి సభా ప్రాంగణానికి వచ్చి MSME పార్కులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:15 గం.కు ఉండవల్లికి బయలుదేరుతారు.
News November 11, 2025
కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

కరోనా లాక్‌డౌన్ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
News November 11, 2025
ఇతిహాసాలు క్విజ్ – 63

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడిని గురువైన పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


