News April 11, 2024
చిత్తూరులో అక్కడ బావ, మరదల పోటీ

చిత్తూరు జిల్లాలో జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఈసారి బావ, మరదల మధ్య పోటీ జరగనుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి వైసీపీ జీడీనెల్లూరు MLA అభ్యర్థిగా, ఆయన చెల్లెలు కుమారుడు రమేశ్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. బావ, మరదల పోటీలు ఎవరు గెలుస్తారో చూడాలి మరి. ఇదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా వీఎం.థామస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Similar News
News March 20, 2026
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు..!

అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో వి.కోట, గుడుపల్లె మినహా మిగిలిన 26 మండలాల్లో వర్షం కురిసింది. గంగవరంలో 39.4 mm, పలమనేరులో 37.8 mm వర్షపాతం నమోదైంది. మండలాలు వారీగా.. యాదమరిలో 28.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 24.2, పెనుమూరులో 23.2, వెదురుకుప్పంలో 22.2, బైరెడ్డిపల్లిలో 17.2, గుడిపాలలో 12.4, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 12.2, చిత్తూరు రూరల్ లో 10.6 mm వర్షపాతం నమోదు అయింది.
News March 19, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు.
News March 19, 2026
తిరుపతి బస్టాండ్‌లో ఒకే రోజు 24 సెల్ ఫోన్లు చోరీ

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దొంగలకు నిలయంగా మారింది. రద్దీని దొంగలు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో బుధవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించి 24 సెల్ ఫోన్లు దొంగలించారు. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన అనూష రాజంపేటకు వెళ్లేందుకు బస్టాండ్‌కు రాగా 150 గ్రా. బంగారు నగల బ్యాగు చోరీకి గురైంది.


