News November 7, 2025

ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఐఐటీ బాంబేలో 53 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/

Similar News

News November 7, 2025

సరస్వతీ దేవి ఎలా జన్మించింది?

image

పూర్వం సృష్టి శూన్యంగా ఉండేది. దీంతో బ్రహ్మ దేవుడు లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ కార్యాన్ని ప్రారంభించడానికి అతనికి జ్ఞానం, వాక్కు అవసరమయ్యాయి. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుంచి తేజోమయి సరస్వతీ దేవిని సృష్టించాడు. ఆమె వీణ, పుస్తకం, జపమాల ధరించి, ఆవిర్భవించింది. బ్రహ్మకు వాక్కు, జ్ఞానం అందించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ వేదాలను, సమస్త విశ్వాన్ని సృష్టించగలిగాడు. అందుకే బ్రహ్మ మానస పుత్రిక అంటారు.

News November 7, 2025

భారీ జీతంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

image

<>నేషనల్<<>> కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో 7 క్యూరేటర్ బీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. MSc/BE/బీటెక్/MS/ఎంటెక్/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1770. నెలకు జీతం రూ.56,100 – రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ncsm.gov.in/

News November 7, 2025

ఆత్మవిశ్వాసాన్ని నింపే ‘వందేమాతరం’: మోదీ

image

వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానమని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన 150వ స్మారకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘ఈ గీతంలోని శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపుతుంది. భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తుంది. ఈ గీతం ఒక సంకల్పం, ఒక మంత్రం, ఒక స్వప్నం. ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. సామూహిక గీతాలాపన అద్భుత అనుభవం’ అని పేర్కొన్నారు.