News November 7, 2025
NZB జిల్లాలో రేపటి నుంచి 163 సెక్షన్

TGPSC నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద రేపటి నుంచి 14వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163ను అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రం వద్ద తిరగవద్దని ఆయన సూచించారు.
Similar News
News March 28, 2026
HYD: సీతారాముల పెళ్లికి పులకించిన పుడమి!

రామరాజ్యం అంటేనే సుభిక్షం. ధర్మబద్ధమైన పాలనలో నెలకు 3 వానలతో సస్యశ్యామలమని ప్రతీతి. అదే రీతిలో శ్రీ సీతారాముల కళ్యాణం రోజు పుడమి తల్లి పులకించేలా వర్షం కురిసింది. ముక్కోటి దేవతలు అక్షింతలు జల్లినట్లు వర్షం రూపంలో కరుణించారేమో అని భక్తులు విశ్వసిస్తున్నారు. కురిసిన ప్రతి జలధారను దేవతల కరుణామృతంగా భావించిన భక్తజనం భక్తి పరవశంతో ఆస్వాదించారు. అంతా రామమయం.. జగమంతా రామమయం అని వ్యాఖ్యానిస్తున్నారు.

కామారెడ్డి: బీడీ కార్మికుల దయానీయం !

కామారెడ్డి జిల్లాలోని బీడీ కార్మికులు తక్కువ వేతనాలతో, తీరని కష్టాలతో కాలం వెళ్లదీస్తున్నారు. రోజంతా కష్టపడినా కనీస కుటుంబ పోషణ భారంగా మారింది. పొగాకు దుమ్ముతోృ అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా.. బీమా, సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులు అధికంగా ఉన్న ఈ రంగంలో కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వం తమను ఆదుకుని సంక్షేమ పథకాలు అందించాలని వారు వేడుకుంటున్నారు.