News November 7, 2025

సబ్బవరం: ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సబ్బవరంలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామచంద్ర రావు తెలిపారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.వీరబాబు (19)గా గుర్తించారు. గురువారం వీరబాబు డిఫెన్స్ అకాడమీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Similar News

News March 5, 2026

ప.గో: హాల్ టికెట్లు సిద్ధం.. డౌన్లోడ్ చేసుకోండిలా

image

పదో తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప.గో DEO నారాయణ గురువారం తెలిపారు. bse.ap.gov.in వెబ్‌సైట్, 9552300009 వాట్సప్ నంబర్, మనమిత్ర లేదా లీప్ యాప్ నుంచి వీటిని పొందవచ్చన్నారు. సందేహాలుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని ఆయన సూచించారు. విద్యార్థులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 5, 2026

ఖాద్రీశుడికి విజయనగర రాజుల విశేష సేవలు

image

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజులు ఎంతో అభివృద్ధి చేశారు. మరీ ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందింది. ఆయన పాలనలో ఆలయం విస్తరణ, గోపుర నిర్మాణాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయంలో అద్భుతమైన శిల్పకళ, స్తంభాలు గోపురాలు, భక్తులను ఆకట్టుకుంటాయి. స్వామివారి విగ్రహం నుంచి కొన్నిసార్లు చెమట బిందువులు కనిపిస్తాయని భక్తుల నమ్మకం.

News March 5, 2026

WGL: పాలిటెక్నిక్ విద్యార్థులకు వరం.. పెరిగిన సీట్లు!

image

సాంకేతిక విద్యపై మక్కువ చూపే పదో తరగతి విద్యార్థులకు శుభవార్త. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని పలు పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అత్యధికంగా 960 సీట్లు అందుబాటులో ఉండగా, కేసముద్రంలో 300, పరకాలలో 240, స్టేషన్ ఘన్‌పూర్‌లో 240, కాటారంలో 180 సీట్లు ఉన్నాయని అడ్మిషన్ల విభాగం తెలిపింది. పాలిసెట్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.