News November 7, 2025
ADB: ఉద్యోగం పేరిట రూ.6.08లక్షలు కాజేశారు

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ యువకుడు మోసపోయిన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. ఖుర్శిద్ నగర్‌కు చెందిన ఓ యువకుడికి ఇన్‌స్టాలో జాబ్ యాడ్ వచ్చింది. అది చూసి సదరు కంపెనీని సంప్రదించాడు. టాస్క్‌లు పూర్తి చేస్తే అకౌంట్‌లో నగదు జమ అవుతుందని నమ్మించి విడతల వారీగా రూ.6.08 లక్షలు కాజేశారు. మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యం పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
Similar News
News March 28, 2026
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్ తాజా ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్దకాన్ యురేనియం ప్లాంట్‌లను టార్గెట్ చేసింది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన కీలక ఇన్‌ఫ్రాను ధ్వంసం చేయడమే లక్ష్యమని IDF వెల్లడించింది. ఈ అటాక్స్‌లో ఎటువంటి ప్రాణనష్టం, రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.
News March 28, 2026
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం
News March 28, 2026
హన్మకొండ ఆర్టీసీ డిపోలో నేడు ‘ఫోన్-ఇన్’

HNK RTC డిపోలో శనివారం డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు పోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు DM ధరమ్ సింగ్ తెలిపారు. ఆర్టీసీ హనుమకొండ డిపో పరిధిలోని జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలావరంగల్, హాసన్ పర్తి, కమలాపూర్, WGL, HNK, KZPT మండల పరిధిలోని గ్రామాల ప్రజలు డిపో అభివృద్ధి, బస్సు సర్వీసులపై తమ అభిప్రాయాలను 8977781103 ఫోన్ నెంబర్లో తెలపాలన్నారు.


