News November 7, 2025
స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News March 29, 2026
చిత్తూరు: అక్రమ వాడకం నిలిచేనా..?

జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల పంపిణీని ప్రభుత్వం నియంత్రించింది. ఈ నేపథ్యంలో హోటల్లు, టీ అంగళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్లను తమ వ్యాపారం కోసం పలుచోట్ల వినియోగిస్తున్నారు. ఇటీవల వీ.కోటలో నిర్వహించిన దాడుల్లో హోటల్లలో డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు.
News March 29, 2026
చిత్తూరు: ‘రూ.3.15 కోట్ల మోసం’

బంగారుపాలెం పరిధిలో మురళీకృష్ణ రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని లోకేశ్ వద్ద రూ.3.15 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై లోకేశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసరావు తెలిపారు.
News March 29, 2026
చిత్తూరు: సిలిండర్ల పంపిణీలో మార్పులు

హోటల్ యాజమాన్యాలకు అవసరమైనమేర కమర్షియల్ సిలిండర్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గత ఆరు నెలల కాలంలో వారు వినియోగించిన గ్యాస్ సిలిండర్ల వివరాలను లెక్కించి.. నెలకు అవసరమైన కమర్షియల్ సిలిండర్ కోటా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో గృహ అవసర గ్యాస్ సిలిండర్లకు కొరతలేదని స్పష్టం చేశారు.


