News November 7, 2025

ఎగుమతులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ సదస్సు

image

AP నుంచి ఎగుమతులు పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలో ‘ఏపీ గ్లోబల్ MSME ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ సమ్మిట్’ నిర్వహించనుంది. బ్రిటన్, రష్యా, ఆస్ట్రియా, జపాన్, హంగేరీ, ఈజిప్ట్, న్యూజిలాండ్, ఉగాండా, జింబాబ్వేతోపాటు 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని సంస్థలు తయారుచేసే ఉత్పత్తులు, వాటి ఎగుమతుల అవకాశాలను అధికారులు వివరిస్తారు.

Similar News

News March 5, 2026

ఇరాన్‌పై US పోరు వెనుక మతం రంగు?

image

ఇరాన్‌పై దాడులను సమర్థించుకునే క్రమంలో US తమ సైనికులకు మతసిద్ధాంతాలను చొప్పిస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. దాదాపు 40 యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు వచ్చినట్లు మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వెల్లడించింది. బైబిల్‌లో పేర్కొన్న అర్మాగెడ్డాన్ (చెడుపై దేవుడి పోరు)ను సృష్టించేందుకు ఇరాన్‌పై దాడి చేయమని ట్రంప్‌కు జీసస్ సందేశం పంపారని కమాండర్ అధికారులకు చెప్పినట్లు రిపోర్ట్ పేర్కొంది.

News March 5, 2026

గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

image

AP: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చే బిల్లుకు నిన్న శాసనమండలిలో ఆమోదం లభించింది. YCP హయాంలో లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్ధను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వీటితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.

News March 5, 2026

సీఐఏను సంప్రదించిన ఇరాన్ ఇంటెలిజెన్స్?

image

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌పై USతో చర్చలకు నో చెబుతున్నా అంతర్గతంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. US నిఘా సంస్థ సీఐఏతో చర్చలకు సుముఖత వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇందుకు మరో దేశ స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తోందని ఇరు దేశాల అధికారులు చెప్పినట్లు రిపోర్ట్ చెబుతోంది. అయితే తమ హైకమాండ్ ఎలా స్పందిస్తుందోనని ఏజెన్సీలు సందిగ్ధంలో ఉన్నట్లు పేర్కొంది.