News November 7, 2025
డోన్ కర్నూలులో కలిసేనా!

డోన్ నియోజకవర్గాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో కలపాలని MLA కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి CM దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా, రెవెన్యూ డివిజన్ మార్పుచేర్పులలో భాగంగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మంత్రి BC ప్రతిపాదించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. డోన్-నంద్యాల 108KM కాగా డోన్-కర్నూలు 54KM. ఈ క్రమంలో డోన్ కర్నూలులో కలిస్తే బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.
Similar News
News March 21, 2026
నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం

నెల్లూరు జిల్లాలో వరి పంట చేతికోస్తుంది. ఈక్రమంలో అకాల వర్షాలు రైతులను ముంచేసింది. అనంతసాగరం, కలవాయి,రాపూరు, మర్రిపాడు మండలాల పరిధిలో ఇటీవల వర్షం కురిసింది. దీంతో 19 గ్రామాల పరిధిలో వరి 1157 హెక్టర్లు, పత్తి 140 హెక్టర్లలో మొత్తంగా 1297 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు.
News March 21, 2026
సంగారెడ్డి: రోగుల వివరాలు ఇక డిజిటల్ రూపంలో..

రోగుల పూర్తి వైద్య వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో జరిగిన శిక్షణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టు కింద జోగిపేట, పటాన్‌చెరు, సదాశివపేట ఏరియా ఆసుపత్రులతో పాటు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల డిజిటల్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని తెలిపారు.
News March 21, 2026
పిట్లం: షీర్ ఖుర్మా.. పాలకు డిమాండ్

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా పిట్లంలో పాల ధరలు పెరిగాయి. పండుగ ప్రత్యేక వంటకమైన ‘షీర్ ఖుర్మా’ తయారీకి పాలు ప్రధానం కావడంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో కంటే అదనపు అవసరం ఉండటంతో పాల కేంద్రాల్లో లీటర్ పాలు రూ.80 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో లీటర్ పాల ధర ఎంత ఉందో? కామెంట్ రూపంలో తెలియజేయండి.


