News November 7, 2025

వరంగల్: అమ్మ, నాన్నకు ప్రేమతో..!

image

పిల్లలు పుట్టగానే కాదు వాళ్లు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం అని ఒక కవి అన్నారు. ఆమె పుట్టి ప్రయోజకురాలు అవడమే కాకుండా తల్లిదండ్రుల చిరకాల స్వప్నమైన సొంతింటిని గిఫ్ట్‌గా ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పర్వతగిరి(M) కల్లెడకు చెందిన జీవంజి దీప్తి పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి తల్లిదండ్రుల పేరును నిలబెట్టింది. అంతేకాదు, సొంతింటిని హనుమకొండలో కొని ఇచ్చింది.

Similar News

News March 11, 2026

SRPT: లక్ష్యం ఉంటేనే విజయం తథ్యం: కలెక్టర్

image

విద్యార్థులు లక్ష్యంతో చదివితేనే విజయం సాధ్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి, వారికి నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీని పరిశీలించారు. పాఠశాల, అంగన్వాడీ నిర్వహణపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు.

News March 11, 2026

SRPT: ‘2027 జనాభా గణన దేశాభివృద్ధికి కీలకం’

image

ప్రభుత్వ పథకాల అమలుకు 2027 జనాభా లెక్కలు కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి దశ ఇళ్ల జాబితా నమోదు, 2027 ఫిబ్రవరిలో రెండో దశ గణన జరుగుతుందని వివరించారు. తొలిసారిగా డిజిటల్ విధానంలో, మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

News March 11, 2026

వికారాబాద్: ‘పది’ పరీక్షలు.. ఇదిగో వివరాలు..!

image

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 13,514 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా విద్యాధికారి- డీఈవో రేణుకాదేవి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 69 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. 13,514 మంది విద్యార్థుల్లో- బాలురు- 6,740 మంది, బాలికలు- 6,774 మంది ఉన్నారన్నారు. 824 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఐదు ప్రత్యేక బృందాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేశామన్నారు.