News November 7, 2025

HYD: వాట్సప్‌‌లో ‘ది ఎండ్’ అని స్టేటస్.. యువతి సూసైడ్ అటెంప్ట్

image

ఔషాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో BSC నర్సింగ్ 3rd ఇయర్ విద్యార్థిని పూజిత (22) కాలేజీ బిల్డింగ్ నుంచి దూకిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలు కాగా ఆమెను నిమ్స్‌కు తరలించారు. అన్నోజిగూడలో నివాసం ఉంటోంది. జ్వరం రావడంతో కళాశాలకు స్నేహితులతో వచ్చింది. బుధవారం వాట్సప్ స్టేటస్‌లో ‘ది ఎండ్’ అని పెట్టుకుంది. మధ్యాహ్నం లంచ్‌కి రాకుండా ఫోన్‌లో మాట్లాడి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News November 7, 2025

PRG: సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టి పేలి.. ఒకరి మృతి

image

పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వద్ద ఉన్న సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు స్టీల్ కరిగించే బట్టి పేలింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నారీ జిల్లాకు చెందిన కార్మికుడు మహ్మద్ అలీ (33) గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు రషీద్‌తో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు SI మోహనకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 7, 2025

నేడు పేర్కంకంపల్లికి ఎమ్మెల్సీ కవిత

image

యాలాల: చేవెళ్ల బస్సు ప్రమాదంలో పెర్కంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియా, తనుష, నందిని మరణించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు MLC కవిత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రానున్నారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

News November 7, 2025

అక్బర్‌పేట-భూంపల్లి: అరుదైన ఘటన.. ఆవుకు రెండు దూడలు

image

అక్బర్‌పేట- భూంపల్లి మండలం అగ్రహారం గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రైతు సాదుల సురేష్‌కు చెందిన గోమాత ఒకే ప్రసవంలో రెండు లేగదూడలకు (మగ, ఆడ) జన్మనిచ్చింది. ఒక గంట వ్యవధిలో ఈ దూడలు పుట్టడంపై రైతు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అరుదైన దృశ్యం కావడంతో పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి చూస్తున్నారు.