News November 7, 2025

మెదక్: శ్మశానంలో దొంగలు.!

image

కీచురాళ్లు.. శవాలను తింటాయని చదివాం.. కానీ శ్మశానంలో దొంగల బెడద ఉందంటే నమ్ముతారా? అవును మీరు చదివింది నిజమే. మెదక్ జిల్లాలోని చేగుంటలోని వైకుంఠ ధామంలో కాలుతున్న శవాల బూడిద, పుర్రెలు, ఎముకలను దుండగులు ఎత్తుకెళ్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. బూడిదతో పాటు పుర్రెలను ఎత్తు కెళ్లటంతో వాటితో క్షుద్రపూజలు చేస్తున్నారా? అంటూ ప్రజలు భయపడుతున్నారు.

Similar News

News March 12, 2026

రోడ్లు-భవనాల శాఖ పురోగతిపై సీఎం సమీక్ష

image

తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News March 12, 2026

మహబూబాబాద్ జిల్లాలో 45 పరీక్షా కేంద్రాలు

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు మహబూబాబాద్ జిల్లాలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల కోసం విషయ నిపుణులతో అవగాహన కార్యక్రమం, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలను ఏర్పాటు చేయగా..8157 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 4156 మంది, బాలికలు 4001 మంది ఉన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News March 12, 2026

కడప: ‘సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు’

image

కడప జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూమి సెటిల్‌మెంట్లు, ఇతర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై ఆధారాలు లభ్యమవ్వడంతో సీఐ అశోక్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా ఆయన గత రెండేళ్లుగా వీఆర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.