News November 7, 2025

SRCL: కవర్ కప్పలేదని టిప్పర్ సీజ్

image

స్టోన్ డస్ట్ రవాణా చేస్తున్న ఓ టిప్పర్‌ను పోలీసులు సీజ్ చేయడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల తనిఖీలు నిర్వహించే సమయంలో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, సరుకు రవాణా అనుమతి పత్రాలు మాత్రమే పరిశీలిస్తారు. దీనికి భిన్నంగా కవర్ కప్పకుండా తీసుకువెళ్తున్న స్టోన్ డస్ట్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి టిప్పర్‌ను సీజ్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది.

Similar News

News March 9, 2026

NZB: ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో జిల్లా వాసులకు మెడల్స్

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు మెడల్స్ సాధించారు. థాయిలాండ్‌లో జరిగిన ఈ పోటీల్లో జిల్లా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న గోపి 110 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్, ట్రిపుల్ జంప్, 4×100, 4×400 రిలేలో 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. రఘువీర్ హ్యమర్‌త్రోలో సిల్వర్ మెడల్, షాట్ పుట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుపొందారు. దినేశ్ వాగ్మారే 4×100, 4×400 రిలేలో 2 సిల్వర్ మెడల్స్ సాధించారు.

News March 9, 2026

CI రవి నాయక్, SI ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పొక్సో కేసు ముద్దాయి విషయంలో అలసత్వం వహించారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐ సస్పెండ్‌తో కలకలం రేగింది.

News March 9, 2026

శ్రీకాకుళం: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

image

శ్రీకాకుళం నగరం జడ్పీ ఎదురుగా APHB కాలనీకి చెందిన డబ్బీరు నిఖిత ఇటీవల మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. శ్రీకాకుళం రూరల్ నైర వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బిఎస్సీ, భువనేశ్వర్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఐబీపీఎస్ పరీక్ష ద్వారా క్లర్క్ పీవో ఉద్యోగాలకు, అలాగే ఎస్బీఐలో క్లర్క్ పోస్టుకు ఎంపికైంది. రెండు ఉద్యోగాలు ఇంటర్వ్యూ దశలో ఉన్నాయి.