News November 7, 2025

చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

image

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

Similar News

News March 19, 2026

16.7L మె.టన్నుల క్రూడ్ నిలిచిపోయింది: కేంద్రం

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారతీయ జెండా ఉన్న 22 నౌకలు పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయని నౌకాయాన మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఇందులో 16.7L మె.టన్నుల క్రూడాయిల్, 3.2L మె.టన్నుల LPG, 2L మె.టన్నుల LNG ఉన్నాయని తెలిపారు. ఈ నౌకల్లోని 611 మంది ఇండియన్ నావికులు సురక్షితంగా ఉన్నారన్నారు. అన్ని దేశాలకు చెందిన దాదాపు 500 నౌకలు ఆగిపోయాయని పేర్కొన్నారు.

News March 19, 2026

విద్యార్థుల చేతిరాతపై ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు!

image

AP: విద్యార్థుల చేతిరాత బాగాలేదనే కారణంతో మార్కులు తగ్గించవద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సమాధానాల ఆధారంగానే మూల్యాంకనం చేయాలని జూ.లెక్చరర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘పూర్తిగా చదవకుండానే మార్కులు ఇవ్వొద్దు. ఆన్సర్స్ సరిగ్గా ఉంటే చేతిరాత కారణంగా మార్కులు తగ్గించవద్దు’ అని సూచించింది. పొరపాట్లు వస్తే ₹3వేలు-7500 వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి మూల్యాంకనం మొదలు కానుంది.

News March 19, 2026

తొలి విడతలోనే అందరికీ రైతు భరోసా?

image

రైతు భరోసా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విస్తీర్ణం ప్రాతిపదికన విడతల వారీగా కాకుండా ఈ నెల 22న ఒకే రోజు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చూస్తోంది. రైతుకు ఎంత భూమి ఉన్నా తొలి విడతలో మొదటి ఎకరాకు ₹6,000 నగదును అకౌంట్లలో జమ చేస్తారని సమాచారం. మిగిలిన భూమికి 2, 3 విడతల్లో సాయం అందనుంది. ఎకరం లోపు ఉన్న వారికి ఎలాగూ తొలిరోజే పడుతుంది.