News November 7, 2025

నిర్మల్: కార్డులు సరే.. పథకాలు ఏవి?

image

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా మారింది కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలో 29,386 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే రేషన్ కార్డుదారులు బియ్యం పంపిణీ మినహా ఇతర ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు. ప్రజాపాలన వెబ్ సైట్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆప్షన్ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

Similar News

News April 6, 2026

‘God is good’.. అమెరికాను వణికించిన SOS

image

ఇరాన్‌లో కూలిన F-15Eలోని పైలట్ రెస్క్యూ కోసం చేపట్టిన ఆపరేషన్‌కు ముందు అమెరికన్ నిఘా వర్గాలకు ఊహించని పరిణామం ఎదురైంది. పైలట్ నుంచి వచ్చిన ‘God is good’ అనే అత్యవసర మెసేజ్(SOS) వారిని భయపెట్టింది. అది ఇరాన్ పన్నిన వల అయ్యుండొచ్చని.. వెళ్తే ఒక్కసారిగా దాడిచేసే ప్రమాదం ఉందని భావించారు. చివరకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పైలట్ లొకేషన్, ఆయన స్థితిని తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి రక్షించారు.

News April 6, 2026

సింగరేణి సంస్థలో క్రమంగా తగ్గుతున్న కార్మికుల సంఖ్య

image

సింగరేణి సంస్థలలో కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. యాజమాన్యం సింగరేణి యాంత్రీకరణ పేరుతో భూగర్భ గనులను మూసివేసి ఓపెన్ కాస్ట్ గనులు ఏర్పాటు చేస్తూ ఉండడంతో కార్మికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 14 ఏళ్లలో దాదాపు 28,000 మంది కార్మికులు ఇంటిబాట పట్టారు. 2013-14 లో 61, 778 మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం 39,460 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో కార్మికులకు పని భారం పెరిగింది.

News April 6, 2026

సింగరేణిలో క్రమంగా తగ్గుతున్న కార్మికుల సంఖ్య