News November 7, 2025

వరంగల్‌లో డెంగీ డేంజర్ బెల్స్.. మొంథాతో పారిశుద్ధ్యం దెబ్బ!

image

వరంగల్ జిల్లాలో డెంగీ కేసులు ఆందోళనకర స్థాయికి చేరాయి. జనవరి నుంచి నవంబర్ 6 వరకు 240 కేసులు నమోదయ్యాయి. 100 మందిలో ఐదుగురికి పైగా పాజిటివిటీ రేటు నమోదైంది. తాజాగా, మొంతా తుఫాన్ ప్రభావంతో నగరంలో పారిశుద్ధ్యం దెబ్బతింది. వర్ష జలాలతో మురుగు నీరు కలిసి కాలువలు మూసుకుపోవడంతో దోమల పెరుగుదల తీవ్రంగా ఉంది. ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతుండగా.. అధికారులు తక్షణ శుభ్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News April 12, 2026

చర్చలు విఫలం.. ఏం జరగబోతోంది?

image

అమెరికా-ఇరాన్ చర్చలు <<19629050>>విఫలం<<>> కావడంతో 14 రోజుల సీజ్‌ఫైర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ దేశంలోని న్యూక్లియర్, విద్యుత్, ఆయిల్ ప్లాంట్లను ధ్వంసం చేయవచ్చు. అటు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, రిఫైనరీ ప్లాంట్లను టార్గెట్ చేసుకొని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయవచ్చు.

News April 12, 2026

MHBD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

image

ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శనివారం జరిగింది. మట్వాడ శివారు నీలవంచకు చెందిన చిన్నారులు శ్రీజ(9), చైత్ర(9) చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

News April 12, 2026

MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.