News November 7, 2025
నిడదవోలులో యాక్సిడెంట్.. యువకుడి మృతి

నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. త్రిబుల్ రైడ్ చేస్తూ వస్తున్న ముగ్గురు యువకులు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 15, 2026
నంద్యాలలో ‘ఒక్క రూపాయికే’ భోజనం

నంద్యాలలో గోళ్ల రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక్క రూపాయికే భోజనం కార్యక్రమాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకుడు బ్లడ్ అచ్చు అభినందించారు. ఫుడ్ పాయింట్‌ను సందర్శించిన ఆయన.. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం రుచిగా ఉందని వారు తెలిపారు. నంద్యాలకు వచ్చే ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
News March 15, 2026
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే ఆస్కారముందని చెప్పింది. మరోవైపు ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు TGలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, HYD, మేడ్చల్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెంలో ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
News March 15, 2026
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జనవరి 1 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఓవర్ స్పీడ్ 1,889, హెల్మెట్ లేకుండా 1,763, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 79 కేసులు నమోదు కాగా, 1,686 డ్రంకెన్ డ్రైవింగ్, 2,223 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


