News November 7, 2025

పేరు గొప్ప.. వికారాబాద్ దిబ్బా.!

image

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా వికారాబాద్ జిల్లా పరిస్థితి మారింది. VKB జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మరెన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నా జిల్లాను పాలకులు అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి ఉద్దండ రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడం గమనర్హం.

Similar News

News March 20, 2026

పోచంపల్లి వాసికి గద్దర్ ఫిల్మ్ అవార్డు

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2025’ లో “UNITY – The Man of Social Justice” డాక్యుమెంటరీ మొదటి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచింది. సామాజిక బాధ్యత, చారిత్రక నేపథ్యం కలగలిసిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భూదాన్ పోచంపల్లి వాసి విజయ్ కుమార్ బడుగు అవార్డును అందుకున్నారు.

News March 20, 2026

265 పోస్టులు.. మార్చి 25 వరకు గడువు

image

మధ్యప్రదేశ్ ఇటార్సిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 265 కెమికల్ ప్రాసెస్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (NAC) ఉన్నవారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.19,900+DA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in

News March 20, 2026

ADB: పెళ్లి పేరుతో వల.. అమ్మాయిల విలవిల..!

image

ఉమ్మడి ADB ఏజెన్సీలో ఉత్తరాది మానవ అక్రమ రవాణా ముఠాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఆదివాసీ గిరిజనుల పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్‌కు చెందిన దళారులు గిరిజన యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెళ్లి, ఉపాధి పేరుతో కుటుంబాలకు డబ్బులు ముట్ట జెప్పి మహిళలను అక్రమంగా తరలించి, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బెజ్జూర్‌ ఘటన వెలుగులోకి వచ్చింది.