News November 7, 2025

మన్యంలో క్రమేపీ తగ్గుతున్న ఉష్టోగ్రతలు

image

అల్లూరి జిల్లాలో రాత్రి పూట క్రమేపీ చలి పెరుగుతోంది. ఉష్టోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. ఉదయం మంచుకురుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని జీ.మాడుగులలో గురువారం 14.2 ° సెల్సియస్ నమోదు కాగా అరకువ్యాలీలో 14.9°, డుంబ్రిగుడ 15.5, ముంచంగిపుట్టు 15.7, హుకుంపేట16, పెదబయలు 16.3, పాడేరు16.7, చింతపల్లి 17, వై. రామవరం 19°, మారేడుమిల్లి 19.3 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 18, 2026

నేడు అకౌంట్లలోకి డబ్బులు

image

AP: పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో నేడు ప్రభుత్వం రూ.250 కోట్లు జమ చేయనుంది. ఉగాది కానుకగా CM చంద్రబాబు ఇవాళ కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నారు. వీరికి గతేడాది సంక్రాంతికి రూ.980 కోట్లు, దీపావళికి రూ.1,000 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016లో తాము రూ.700 కోట్లు ఇవ్వగా.. YCP హయాంలో ఒక్క రూపాయీ చెల్లించలేదని ఆరోపిస్తోంది.

News March 18, 2026

విషాదం.. టెన్త్ విద్యార్థిని సూసైడ్!

image

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కంబదూరులోని గుండ్లపల్లి కాలనీలో చోటుచేసుకుంది. మైథిలిని చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఐరన్ టాబ్లెట్లు మింగింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లగా మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఎస్ఐ లోకేశ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 18, 2026

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషనే ఎందుకు?

image

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్, నాయకత్వ లక్షణాల వల్లే అతడి వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపిందని సమాచారం. ఝార్ఖండ్ జట్టుకు తొలిసారి SMAT ట్రోఫీ అందించడంతోపాటు అద్భుత ఆటతో భారత జట్టులోకి ఇషాన్ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో బ్యాటింగ్‌లో తడబడుతున్న అభిషేక్‌తో పోలిస్తే ఇషాన్‌ను SRH ఫస్ట్ ఛాయిస్‌గా చూసినట్లు టాక్. మీరేమంటారు?